ఖమ్మం పోలీస్ కమిషనర్ కు శౌర్య పతకం (గ్యాలంటరీ అవార్డు) లభించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్యసాహసాలతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ మెడల్-2024 కు ఎంపిక చేసింది. ఈమేరకు హైదరాబాద్ గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్యాలంటరీ మెడల్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వీకరించారు. తమ ఉన్నతాధికారికి ఈ అవార్డు రావడం పట్ల ఖమ్మం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
