జిల్లా కలెక్టర్లతో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు జారీ చేసిన కీలక ఆదేశాలకు సంబంధించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
- అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలి.
- జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువనమోదైనా, గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
- అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.
- భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశాం.
- వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నాం.
- పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలి.
- హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి.
- జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలి.
- గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
- పీహెచ్ సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి.
- కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే.
- కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.
- అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.
- ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని సీఎస్ ను ఆదేశిస్తున్నా.
- వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి.
- 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం.
- యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతీ ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలి.
- స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు.
- ఆందోళన అవసరం లేదు, కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది.
- ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోండి.
- రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదు.
- ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయండి.
- రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయి.
- గతంలో రేషన్ షాపులపై ఆసక్తి ఉండేది కాదు.
- సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది.
- రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది.
- ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తీసుకోవాలి.
- శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జి మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి.
- ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలి.
- ప్రతీ మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి.


