Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలను కోల్పోవలసి వస్తోందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆమోదం తెలుపుతూ ఫైలుపై సంతకం చేశారు.

Popular Articles