చింతూరు: అల్లూరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి మార్గంలోని ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున బస్సు లోయలో పడిన ఘటనలో పదిహేను మంది మృత్యువాత పడినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. ఆ తర్వాత ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువపడింది. తాజా సమాచారం ప్రకారం చనిపోయినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
బస్సు ప్రమాదపు తీవ్రతను తెలిపేవిధంగా దృశ్యాలు ఉన్నాయి. తలకిందులుగా పడిపోయిన బస్సు, దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాల దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి.
ప్రత్యేక గమనిక: కలచివేసే దృశ్యాలను చూసి తట్టుకోలేనివారు ఈ ఫొటోలను చూడవద్దు








