చైనాలో ఏం జరుగుతోంది? జిన్ పింగ్ అదృశ్యం దేనికి సంకేతం!? ఇదీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. చైనా అధ్యక్షుడు గత మే 21వ తేదీ నుంచి జూన్ 5వ తేద వరకు దాదాపు పదహారు రోజులపాటు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. చైనాలో అధ్యక్ష మార్పునకు ఇది సంకేతంగా వివిధ దేశాల నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయట. చైనాకు కాబోయే అధ్యక్షుడు టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ గా ఊహాజనిత వార్తలు వెలువడుతున్నాయి. జిన్ పింగ్ అదృశ్యపు పరిణామాలు ‘చక్రవర్తి’ పాలనకు ముగింపుగా పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు తమ కథనాలకు శీర్షికలను పెడుతున్నాయి.
అయితే జిన్ పింగ్ ఈ విధంగా అదృశ్యం కావడం కొత్తేమీ కాదని, సాధారణమేనని మరికొన్ని నిఘా సంస్థలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో దేశాధినేతలను పక్కన బెట్టడడం చైనా కమ్యూనిస్టు పార్టీలకు ‘రివాజు’గానూ ఆ నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల్లో పేర్కొంటున్నాయి. మొత్తంగా దాదాపు 16 రోజులపాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ చర్చనీయాంశంగా మారింది.
