ఛత్తీస్ గఢ్ కు చెందిన 19 మంది మావోయిస్టు పార్టీ నక్సలైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ లో బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వారు కాగా, ఇందులో సౌత్ బస్తర్ అగ్రికల్చర్ టీం డీవీసీ సభ్యునితోపాటు పీఎల్జీఏ, మిలీషియా, దండకారణ్యం విభాగాలకు చెందిన సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన నక్సల్స్ లో నరోటి మనీష్, మడివి నంద, మడివి హండా, మడకం దేవా, కలుమ ఐత, పొడియం సమ్మయ్య, పొడియం నగేష్, సోడి హర్జాన్, పొడియం అడ్మ, మడకం ఉంగా, కుంజం మాస, మిర్గం సుక్కయ్య, మడివి ఇడుములయ్య, సల్వం వెంకట్, సల్వం శంకర్, మడివి కోస, దర్జో సూల, సోడి ఇడుమలు ఉన్నారు.
గత జనవరి నెలలో చర్లలో మావోయిస్టు కుటుంబ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఫలితంగా ఆయా నక్సలైట్లు లొంగిపోయినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్ పునరావాస చర్యలను, వారికి అందించే అన్నిరకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.