Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వైరల్ వీడియో: ‘డాన్సర్’తో ఎమ్మెల్యే చిందులు

ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు మహిళా డాన్సర్ తో చిందులేసిన వీడియో వైరల్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, పార్లమెంటరీ కార్యదర్శి గులాబ్ కమ్రో ఓ డాన్సర్ తో కలిసి చేసిన నృత్యం అక్కడి రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. ఈ ఎమ్మెల్యే మహిళా డాన్సర్ తో కలిసి చిందేస్తున్న సమయంలో అతని మద్ధతుదారులు చప్పట్లు, కేరింతలు కొడుతూ, కరెన్సీ నోట్లను వెదజల్లిన వైనం విమర్శలకు తావు కల్పించింది. ఎమ్మెల్యేను పార్లమెంటరీ కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని కూడా అతని రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి ఎమ్మెల్యే కమ్రో తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఇది. పెళ్లి సంబరాల్లో మహిళా డాన్సర్ చేసిన డాన్స్ ను చూశాక ఎమ్మెల్యే తనను తాను తమాయించుకోలేకపోయారట. డాన్సర్ తో కలిసి తానూ ఉత్సాహంగా చిందులేశారు. ఎమ్మెల్యే కమ్రో మాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నారు. తాను తన ప్రజల ఆనందోత్సాహాల్లో పాలు పంచుకున్నానని, ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదంటున్నారు. తాను డాన్స్ చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం కలగలేదని ఎమ్మెల్యే కమ్రో పేర్కొనడం విశేషం. ఎమ్మెల్యే కమ్రో డాన్స్ వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles