Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఏపీలో లిక్కర్ ‘చీప్..’! నిజమెంత!?

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు భారీగా తగ్గనున్నాయా? ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రూపొందించిందా? ఏపీలో మద్యపాన ప్రియులు పండగ చేసుకునే రోజులు వచ్చాయా? వచ్చే నెల 1వ తేదీ నుంచి ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ సీసాలు కారుచౌకగా లభించనున్నాయా? ఇటువంటి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఒకటి.. ఆ పోస్టులో పేర్కొన్న లిక్కర్ బ్రాండ్ల ధరలు చూస్తే మాత్రం లిక్కర్ ప్రియుల గొంతు తడారిపోయే అవకాశమే ఉండకపోవచ్చు. ఇంతకీ ఆ పోస్టు ఏమిటో దిగువన చూడండి.. తర్వాత అసలు విషయం తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్ కొత్త లిక్కర్ పాలసీ:

ఎక్సైజ్ శాఖ

1. విస్కీ

2. బ్రాందీ

3. వోడ్కా

4. బీర్

5. రమ్

(బ్రాందీ)

1. మాన్షన్ హౌస్ :

180ml(120/-)

 360ml(230/-)

 750ml(460/-)

(విస్కీ)

1. ఇంపీరియల్ బ్లూ : 120/-,230/-,460/-

2. మెక్‌డోవెల్ నం.1

        140/-, 280/-,580/-

3. స్టెర్లింగ్ రిజర్వ్

    B7 ( 140/-,280/-,580/-)

    B10 ( 160/-, 310/-,   640/-)

4. బ్లెండర్స్ ప్రైడ్

        200/-,400/-,800/-

5. రాయల్ స్టాగ్

        140/-,280/-,580/-

(వోడ్కా)

1. మేజిక్ క్షణాలు:

        గ్రీన్ యాపిల్ (150/-,300/-,600/-)

నారింజ రంగు

(160/-,340/-650/-)

స్ట్రాబెర్రీ (లూనో)

(200/-,400/-,800/-)

2. సంపూర్ణ వోడ్కా (220/-,480/-,920/-)

3. స్మ్రిన్ ఆఫ్ (220/-,480/-,920/-)

4. బకార్డి నిమ్మకాయ (240/-,520/-,1020/-)

               (బీర్)

1. కింగ్‌ఫిషర్ అల్ట్రా స్ట్రాంగ్ (130/-)

2. నాకౌట్ అల్ట్రా స్ట్రాంగ్ (120/-)

3. ఖజరహో అల్ట్రా స్ట్రాంగ్ (120/-)

4. బడ్‌వైజర్ అల్ట్రా స్ట్రాంగ్ (160/-)

కొత్త లిక్కర్ పాలసీ మాండేట్ నుండి అమలు చేయబడింది..

అక్టోబర్ 1వ 2024

-ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ

ఇదీ ఆ పోస్టు సారాంశం. ఇందులో నిజమెంత? అనే సందేహం కలుగుతోందా? నిజానికి ఈ పోస్టులోని లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఓ ఫేక్ ప్రచారంగా ధ్రువపడిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాబట్టి ఏపీ లిక్కర్ ప్రియులకు ఇక పండగేనంటూ తెలంగాణా మద్యం ప్రియులు జెలసీ ఫీల్ కావలసిన అవసరం లేదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు బూటకంగా ఏపీలోని ప్రధాన మీడియా మిత్రులు చెప్పారు. అదన్నమాట అసలు సంగతి..

Popular Articles