మేడారం: మేడారం రూపురేఖలు మారుతున్నాయి. సమ్మక్క-సారక్క మహా జాతర ఆధునికీరణ పనులు మేడారం దృశ్యాన్నే మార్చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు రూ. 263.00 కోట్ల మొత్తంతో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులు దశాబ్ధాల చరిత్ర గల మేడారం స్వరూపాన్నే మార్చేవిధంగా సాగుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. ఇందులో రూ. 71.00 కోట్ల మొత్తాన్ని వెచ్చించి వనదేవతల గద్దెలను, ప్రాకారాన్ని ఆధునికీకరణ చేస్తున్నారు. అదేవిధంగా రూ. 42.00 కోట్లతో రోడ్ల విస్తరణలో భాగంగా డబుల్ రోడ్డు స్థానంలో నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇవిగాక మరో రూ. 150.00 కోట్లతో జాతర నిర్వహణ పనులు చేపట్టారు.
మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కొత్తూరు తదితర సమీప గ్రామాల్లోనే గాక, జంపన్నవాగులోనూ సాగుతున్న మహా జాతర ఆధునికీకరణ, నిర్వహణ పనుల తాజా దృశ్యాలు ‘సమీక్ష’ పాఠకుల కోసం..








