Top 5 This Week

Related Posts

చంద్రబాబు సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని, ఎన్నికల నిర్వహణ తేదీలను మంత్రులు ముందే ఎలా వెల్లడిస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, అందువల్ల కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాల్లో తాము భాగస్వాముల కాలేమని, అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నదని చంద్రబాబు పేర్కొన్నారు.

Popular Articles