గ్రేటర్ వరంగల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. ఇందులో భాగంగానే వరంగల్ మహానగర శివార్లలోని మామునూరు ఎయిర్ పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేఖను విడుదల చేసింది. అంతేకాదు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఇచ్చిన ఎన్వోసీకి సైతం కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది.
మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రస్తుతం 696.4 ఎకారాల భూమి ఉండగా, మరో 253 ఎకరాల వరకు భూసేకరణ జరపాల్సి ఉంది. ఈ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను విడుదల చేయడం గమనార్హం. మొత్తంగా మామునూరు ఎయిర్ పోర్టు అభివృద్ది కారణంగా గ్రేటర్ వరంగల్ మరింత విస్తరించే అవకాశం ఉంది. కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల ప్రజలకు విమానయాన సౌకర్యం మరింత చేరువ కానుంది. వరంగల్ మహానగరం తెలంగాణాకు రెండో రాజధానిగా మారే అవకాశమూ లేకపోలేదు.