Top 5 This Week

Related Posts

నిలకడలేని తీరు మీది… ఇక నిష్క్రమిస్తున్నా!

రిటైర్డ్ అదనపు డీజీపీ, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ జన సేన పార్టీ నుంచి నిష్క్రమించారు. ఈమేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ లేఖ రాశారు. రాజకీయాలు, సినిమాలకు సంబంధించి పవన్ వ్యవహార శైలిపై లక్ష్మినారాయణ సునిశితంగానే విమర్శలు చేయడం గమనార్హం.

పూర్తి జీవితం ప్రజా సేవకేనని, సినిమాల్లో నటించనని అనేక సార్లు ప్రకటించారని, కానీ మళ్లీ ప్రస్తుతం సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం వల్ల నిలకడ లేని విధి, విధానాలు ఉన్నట్లు తెలుస్తోందని పవన్ ను ఉద్దేశిస్తూ రాసిన లేఖలో లక్ష్మినారాయణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు ఆయన రాసిన లేఖ పూర్తి పాఠాన్ని దిగువన చూడవచ్చు.

Popular Articles