Top 5 This Week

Related Posts

జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పిటిషన్ లో కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్ పై వివరణ ఇవ్వాలంటూ సీబీఐ కోర్టు జగన్ తోపాటు సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే నెల 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ నిర్వహించనున్నది.

Popular Articles