ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఈశ్వరప్రగడ హరిబాబు, అతని కుమారుడు రంగనాధ్ లపై వీఎం బంజర (పెనుబల్లి) పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుబల్లిలోని దుర్గా మోటార్స్ నిర్వాహకుడు పెసరు చైతన్యరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హరిబాబు, రంగనాధ్ లపై బీఎన్ఎస్ చట్టంలోని 296(బి), 115(2), 351(2), 324(5), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీకి ఖమ్మం జిల్లా ప్రధాన డీలర్ గా వ్యవహరిస్తున్న ఈశ్వరప్రగడ హరిబాబు జిల్లాలోని పలు ముఖ్య కేంద్రాల్లో సబ్ డీలర్ షిప్ లు ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఏర్పడిన వివాదంలో పెనుబల్లిలోని దుర్గా మోటార్స్ కు వెళ్లిన హరిబాబు, అతని కుమారుడు రంగనాధ్ లు అక్కడ గల ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదు మేరకు పెనుబల్లి పోలీసులు హరిబాబు, రంగనాధ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.