Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కలకలం: ఆరుగురు ‘హీరో’ బైకుల డీలర్లపై కేసు

ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ ‘హీరో’ వాహనాల విక్రేతలైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరుగురు వ్యాపారులపై వీఎం బంజర (పెనుబల్లి) పోలీసులు కేసు నమోదు చేశారు. ‘హీరో’ కంపెనీ బైకుల అధీకృత డీలర్ (ఏఆర్డీ) ఈశ్వరప్రగడ హరిబాబు కుమారుడు రంగనాధ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

పెనుబల్లిలోని దుర్గామోటార్స్ నిర్వాహకుడు పెసరు చైతన్యరెడ్డిపైన, కల్లూరులోని రంగా ఆటోమోబైల్స్ నిర్వాహకుడు పి. రాముపై, బోనకల్ లోని శ్రీసాయి హరి గణేశ మోటార్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ పై, వైరా ఆటోమోబైల్స్ నిర్వాహకుడు ఎం. రామక్రిష్ణపై, దమ్మపేటలోని శ్రీసాయి వెంగమాంబ ఆటోమోబైల్స్ నిర్వాహకుడు బొల్లా మోహన్ రావుపై, భద్రాచలంలోని ‘హీరో’ ఆథరైజ్డ్ డీలర్ భరత్ పై పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఖమ్మం జిల్లాకు ‘హీరో’ ద్విచక్రవాహనాల విక్రయాలకు తాము అధీకృత డీలర్ కాగా, నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఇన్ వాయిస్ లేకుండా భద్రాచలంలోని మరో డీలర్ నుంచి పెనుబల్లి, కల్లూరు, బోనకల్, వైరా, దమ్మపేట కేంద్రాల్లోని సబ్ డీలర్లు బైకులను విక్రయించారనేది ఈశ్వరప్రగడ రంగనాధ్ ఇచ్చిన ఫిర్యాదులోని సారాంశం. ఈనెల 5వ తేదీన జరిగిన బైకుల విధ్వంసపు ఘటనలో పెనుబల్లి దుర్గా మోటార్స్ నిర్వాహకుడు పెసరు చైతన్యరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వరప్రగడ హరిబాబు, అతని కుమారుడు రంగనాధ్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఆరుగురు ‘హీరో’ బైకుల వ్యాపారులపై తాజాగా నమోదైన కేసు చర్చనీయాంశంగా మారింది.

Popular Articles