డైమండ్ నగల ప్రియులకు శుభవార్త. ఖమ్మంలో ప్రతిష్టాత్మక టాటావారి ‘క్యారెట్ లేన్’ డైమండ్ షోరూం ప్రారంభం శుక్రవారం ప్రారంభమైంది. ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ లో ఏర్పాటు చేసిన టాటావారి క్యారట్ లేన్ డైమండ్ షోరూంను ప్రముఖ డాక్టర్ బోడేపూడి శైలజ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ, క్యారెట్ లేన్ డైమండ్ జ్యువరీ తక్కువ బడ్జెట్ లో మగువలకు ఎంతో హుందాతనము ఇస్తున్నదన్నారు. తాను అమెరికా వెళ్ళినపుడు చాలామంది ఈ క్యారెట్ లేన్ డైమండ్ నే వాడుతున్నారని, దీన్ని మన ఖమ్మానికి విహారిక జ్యువల్స్ వారు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం శుభదాయకంగా చెప్పారు. ఖమ్మం జిల్ా మహిళా మణులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శైలజ సూచించారు.

వీవీసీ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వీవీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఈ క్యారెట్ లేన్ ద్వారా అమ్మే ప్రతి ఉత్పత్తి అత్యున్నత నాణ్యతతో కూడుకున్నదిగా చెప్పారు. కస్టమర్ల పాత బంగారం మార్పిడి ద్వారా కూడా క్యారెట్ లేన్ వారి సరికొత్త ఆభరణాలు పొందవచ్చని వెల్లడించారు. అంతేగాక కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా కూడ కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇది టాటా వారి ప్రొడక్టుగా చెబుతూ, నాణ్యతలో రాజీ పడకుండా డైమండ్స్ ఇవ్వడమే సంస్థ ప్రధాన లక్ష్యమని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఈ క్యారెట్ లేన్ లో డైమండ్ జ్యువల్స్ రూ. 7,000 నుండి ప్రారంభమవుతుందన్నారు. స్టూడెంట్లకు, వర్కింగ్ మహిళలకు, కపుల్స్ వెడ్డింగ్ రింగ్స్ కూడా అతి తక్కువ ధరకే లభ్యమవుతాయని చెప్పారు. ఖమ్మం క్యారెట్ లేన్ డైమండ్ షో రూంలో ప్రారంభ ఆఫర్ గా ప్రతి రూ. 30,000 కొనుగోలుపై కస్టమర్లకు 0.05 మి.గ్రా. బంగారు బహుమతిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డే వైజ్, గిఫ్ట్ కొరకు ప్రత్యేక డైమండ్స్ కూడా ఉన్నట్లు చెప్పారు. అంతేగాక కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని తమ షోరూంకి వచ్చి డైమండ్ నగలు తీసుకునే వెసులుబాటు కూాడా ఉందని, ఓసారి తమ క్యారెట్ లేన్ షోరూంకు విచ్చేసి డైమండ్స్ చూడవచ్చని వీవీసీ గ్రూప్ సంస్థల ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమములో వీవీసీ సంస్థల చెర్మన్ శ్రీమతి ద్రౌపది, సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు