Top 5 This Week

Related Posts

పోలీస్ జవాన్ కిడ్నాప్, హత్య

ఓ పోలీసు జవాన్ ను మావోయిస్టు నక్సలైట్లు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. మల్లూరం సూర్యవంశీ అనే సీఏఎఫ్ జవాను పయనీర్ ప్లాటూన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే గడచిన అయిదు రోజులుగా సూర్యవంశీ కనిపించడం లేదు. రక్తపు మడుగులో గల సూర్యవంశీ మృతదేహాన్ని గంగళూరు-బీజాపూర్ రోడ్డుపై నేడు పోలీసులు కనుగొన్నారు. నక్సలైట్లు ఇతన్ని కిడ్నాప్ చేసి, పదునైన ఆయుధంతో చంపినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంఘటనా స్థలం నుంచి మావోయిస్టుల కరపత్రాన్నికూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగళూరు ఏరియా మావోయిస్టు పార్టీ కమిటీ ఈ హత్యకు బాధ్యత వహించింది. బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ఈ సంఘటనను ధృవీకరించారు.

Popular Articles