Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

బస్సు ప్రమాదం: 13 మంది సజీవ దగ్ధం

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దగ్ధమయ్యారు. బెంగళూరు-గోకర్ణ మార్గంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా నేషనల్ హైవేపై గోర్లత్తు క్రాస్ రోడ్డు వద్ద ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సీబర్డ్ అనే ప్రైవేట్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వైపు వెడుతుండగా, ఓ లారీ రోడ్డు మధ్యలో గల డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 13 మంది సజీవంగా దగ్ధమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణీలుండగా, మరికొందరు గాయపడ్డారు.

Popular Articles