ఖమ్మం: ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన నగరంలోని బాలాజీనగర్ల ో జరిగింది. టూ టౌన్ సీఐ బాలకృష్ణ బుధవారం రాత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్ రహిమాన్ (25) అనే యువకుడు ఈనెల 29వ తేదీన బాలాజీనగర్ లోని ఓ డయాగ్నస్టింగ్ సెంటర్ వద్ద మెట్లపై పడుకుని ఉన్నాడు. రహిమాన్ తో జరిగిన పాత గొడవలను మనసులో పెట్టుకున్న లెనిన్ నగర్ కు చెందిన షేక్ బాజీ అనే వ్యక్తి అతన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. దీంతో గాయపడిన రహిమాన్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూనే అతను చనిపోయినట్లు సీఐ బాలకృష్ణ వివరించారు. మృతుని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

