Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘బూతు’ యూ ట్యూబర్లతో కేటీఆర్ ములాఖత్

జుగుప్సాకరమైన బూతు కంటెంట్ తో సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ రూపొందించిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారనే అభియోగంపై అరెస్టయిన యూ ట్యూబర్లు రేవతి, తన్వి యాదవ్ లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈమేరకు చంచల్ గూడ జైలులో గల ఆ ఇద్దరు మహిళా యూ ట్యూబర్లతో సోమవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు ముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

‘బూతు’ కంటెంట్ సోషల్ మీడియా జర్నలిజానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సరికొత్త భాష్యం చెప్పారు. కాగా రేవతి, తన్వి యాదవ్ లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రతి సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది.

Popular Articles