Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కుంభమేళాలో ఎంపీ వద్దిరాజు దంపతులు

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మి దంపతులు మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు.మహా కుంభమేళా 144 ఏళ్లకోసారి జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ (అలహాబాద్)వద్ద గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదులు కలవడాన్ని త్రివేణి సంగమం అంటారు.మహా కుంభమేళ సందర్భంగా ఈ సంగమంలో స్నానం చేయడం పరమ పవిత్రమైనదిగా, పూర్వజన్మ సుకృతంగా ఆధ్మాత్మిక భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ రవిచంద్ర-విజయలక్మి దంపతులు గురువారం భక్తి ప్రపత్తులతో పుణ్య స్నానమాచరించి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ సమర్పించారు.

Popular Articles