రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. సహచర రాజ్యసభ సభ్యులు ,కేఆర్ఆ సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు తదితరులతో కలిసి వద్దరాజు రాష్ట్రపతి భవన్ లో ఉదయం అల్పాహారం తీసుకున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందునిచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావులతో పాటు రాష్ట్రపతి ముర్మును కలిశారు. అనంతరం అల్పాహారం, తేనీరు స్వీకరించారు.