హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జాయింట్ గా ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 2.00 గటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ కేడర్ కు కేసీఆర్ దిశా, నిర్దేశం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సాగునీటి పథకాలు, జల వినియోగం తదితర అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నారు.

