రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తాను ఒప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని గడచిన 18 నెలలుగా నిలదీస్తూనే ఉన్నామని చెప్పారు. సీఎంతో చర్చకు వస్తానని సవాల్ చేసిన కేటీఆర్ ప్రకటించినట్లుగానే మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. అంతకు ముందు తెలంగాణా భవన్ వద్ద, ఆ తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
