Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘మళ్లీ’ అధికారంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికాంలోకి వస్తుందని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇటీవలి కాలంలో తన ఫాం హౌజ్ కు వచ్చి కలుస్తున్న వేర్వేరు నియోజకవర్గాల నాయకులతో కేసీఆర్ తరచూ మళ్లీ అధికారం ధీమాను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోదావరిఖని నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర శనివారం కేసీఆర్ ఫాంహౌజ్ కు చేరుకుంది.

ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించినవారితో సమావేశమైన కేసీఆర్ మళ్లీ అధికారం తమదేనని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణాను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని, తమ పదేళ్ల పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కేడర్ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని కాంక్షించారు. ఈసారి సింగిల్ గానే ఈసారి అధికారంలోకి వస్తామన్నారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మంత్రి సీతక్క (ఫైల్)

అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క వెంటనే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కలలు కంటున్నారని, బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ లోనే ఉండి, కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచాలని సూచించారు. తాము మాత్రం మంచిపాలనతో ప్రజలకు మేలు చేస్తామని సీతక్క అన్నారు.

Popular Articles