Top 5 This Week

Related Posts

కలకలం: ఖమ్మంలో మొండెం లేని తల

ఖమ్మం నగరంలో మొండెం లేని మనిషి తల ఒకటి తీవ్ర కలకలాన్ని కలిగించింది. నగరంలోని చర్చి కాంపౌండ్ సమీపాన పార్కు వైపున బ్రిడ్జి దిగువ భాగాన మొండెం లేని తల దృశ్యాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. అయితే రైల్వే ట్రాక్ పై మరో తల లేని మొండెం కూడా లభ్యం కావడంతో చర్చి కాంపౌండ్ వద్ద గల తల అందుకు సంబంధించినదిగా పోలీసులు భావిస్తున్నారు. అంతేగాక ట్రాక్ వద్ద ఓ శవం పడి ఉందని బుధవారం రాత్రి ఓ ట్రెయిన్ లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం కూడా అందించినట్లు తెలిసింది.

దీంతో చర్చి కాంపౌండ్ వద్ద గల తల, రైల్వే ట్రాక్ వద్ద లభ్యమైన మొండెం ఒకే వ్యక్తిదిగా భావిస్తున్నారు. బహుషా కుక్కలు ఈ తలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా చర్చి కాంపౌండ్ వద్ద ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన మొండెం లేని తల గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం తలను గోనె సంచిలో వేసి అక్కడి నుంచి తొలగించారు. మొత్తంగా గురువారం ఉదయాన్నే సాక్షాత్కరించిన మొండెం లేని తలను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే ట్రాక్ పై ఎవరో ఆత్మహత్య చేసుకుని ఉంటారని కూడా భావిస్తున్నారు.

Popular Articles