Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

సంజయ్ ‘హిందూత్వ’ రాగం అందుకుంటే…!

తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షునిగా నియమితుడైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘హిందూత్వ’ వాదం గురించి కొత్తగా నిర్వచించేది ఏమి లేదు. శిశుమందిర్ విద్యాలయాల్లో అక్షరాలు నేర్చుకున్న సంజయ్ హిందూత్వమే ప్రధాన ఎజెండాగా రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తూ, కరడుగట్టిన కాషాయవాదిగా ప్రాచుర్యం పొందారు. తనకు క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావాలను ప్రభోదించిన శిశు మందిర్ గురించి ఆయన తరచూ ప్రస్తావిస్తుంటారు కూడా.

ఈ నేపథ్యంలోనే ఆయన అయిదు రోజుల క్రితం కరీంనగర్ శిశు మందిర్ 53వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. శిశుమందిర్ విద్యార్థిగా తాను చదువుకున్న రోజుల్లో ఆలపించిన గీత్ కు మొదటి బహుమతి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తన బాల్య స్మృతులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఓ దేశభక్తి పాట పాడారు. తాను చదువుకున్న చోటుకే అతిథిగా రావడం ఆనందంగా ఉందని సంజయ్ అన్నారు. బీజేపీ అధ్యక్షునిగా నియమితుడైన సందర్భంగా సంజయ్ పాడిన పాట వీడియోను బీజేపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ పాటను దిగువన మీరూ వినొచ్చు.

Popular Articles