బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఈనెల 29వ తేదీన ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. బీజేపీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రామచందర్ రావు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనకు మంగళవారం వస్తున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన జనసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఖమ్మంలో మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖమ్మం జిల్లాలో రామచందర్ రావు పర్యటిస్తారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, అక్కడి నుంచి హబూబాబాద్ జిల్లా పర్యటనకు వెడతారు.
