Top 5 This Week

Related Posts

‘కేసీఆర్ తోక ముడిచారు’

తెలంగాణా సీఎం కేసీఆర్ తోక ముడిచారని బీజేపీ రాాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా సంజయ్ కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయం కోసం ఓ వర్గానికి అంటకాగుతూ, అడ్డదారులు తొక్కుతోందన్నారు. తన ఫోర్జరీ సంతకంతో కూడిన నకిలీ లేఖపై నిజానిజాలు తేల్చుకునేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చానన్నారు. కేసీఆర్ తన సవాల్ ను స్వీకరించి ప్రమాణం చేసేందుకు వస్తారని ఆశించానని, కానీ తోక ముడిచారని సంజయ్ ధ్వజమెత్తారు. సంజయ్ ట్విట్టర్ పోస్టులను దిగువన చూడవచ్చు.

Popular Articles