Top 5 This Week

Related Posts

రఘునందన్ రావుపై మహిళ ఫిర్యాదులో ఉన్నదేమిటి?

బీజేపీ నేత రఘునందన్ రావు తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసిన ఓ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూర్తి వివరాలు ఏమున్నాయ్? ఎప్పుడో 13 ఏళ్ల క్రితం జరిగినట్లు పేర్కొన్న సంఘటనపై ఆ మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన తెలంగాణాలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. హెచ్చార్సీని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థించిన ఆ మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రఘునందన్ రావు ఖండించారు. రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. రఘునందన్ రావుపై మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతిని దిగువన చూడవచ్చు.


Popular Articles