Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

తగ్గని బండి సంజయ్… సీఎం ‘కేసీఆర్’పై మళ్లీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ పర్యటనలో గల తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ చేరుకోవడం, బండి సంజయ్ అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో భిన్న కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులతో కలిసి ఢిల్లీలోనే సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కోతలరాయుడు ఢిల్లీకి వెడతారని తాము ముందే చెప్పామని, వంగి, వంగి పొర్లు దండాలు పెట్టినా తాము క్షమించబోమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొట్టారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని సంజయ్ అన్నారు. లోపల జరిగేది ఒకటి, కేసీఆర్ బయట చెప్పేది మరొకటి అని సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వరద బాధితులకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో తాము కూడా పోరాడుతామన్నారు. అయితే వరదల సమయంలో ఫాం హౌజ్ దాటి బయటకు రాని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి నిధులు కోరారని అన్నారు. కాగా సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ గతంలోనూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Popular Articles