Top 5 This Week

Related Posts

GHMCలో బీజేపీ దూకుడు

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయోత్సాహపు జోష్ తో తెలంగాణా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం ‘మేనేజ్మెంట్ కమిటీ’ని నియమించారు. పలువురు జాతీయ నాయకులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చైర్మెన్ గా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేగాక గ్రేటర్ ఎన్నికలకు జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్, ఉపాధ్యక్షునిగా అఖిలేష్ షెల్లర్, సభ్యుడిగా గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్, కర్ణాటకకు చెందిన సతీష్ రెడ్డిలను నియమించారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో నియామకమైనవారి వివరాలను దిగువన చూడవచ్చు.

Popular Articles