Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ కీలక నిర్ణయం

బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ లేఖను విడుదల చేశారు. రాజాసింగ్ రాజీనామా ఘటనను ఉటంకిస్తూ ‘ మీ లేఖలోని అంశాలు, పార్టీ పని విధానం, సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది, మీరు లేవనెత్తిన అంశాలు అసందర్భం, బీజేపీ జాతీయ అధ్యక్షుని సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాము’ అని అరుణ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.

పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనను అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ పత్రంపై మద్ధతుగా ఎవరూ సంతకం చేయకుండా బెదిరించారని ఆరోపిస్తూ, ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అంటూ వ్యాఖ్యానించి రాజాసింగ్ గత నెల 30వ తేదీన బీజేపీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజాసింగ్ అమర్ నాథ్ యాత్రలో ఉన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాక రాజాసింగ్ తన రాజకీయ భవితపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Popular Articles