Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

గంజాయి నిందితులకు ఏడూళ్ల బయ్యారం పోలీసుల షాక్!

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. అక్రమంగా గంజాయిని రవాణా చేసిన కేసులో నలుగురు నిందితుల, వారి బంధువుల ఆస్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీసులు బుధవారం జప్తు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో నిరుడు జూన్ 29వ తేదీన నమోదైన Cr.No.78/2024 ద్వారా U/s 8(c) r/w 20(b)(ii)(C), 27A, 29 of NDPS Act-1985 చట్టం ప్రకారం నిందితుల, వారి బంధువుల ఆస్తులను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జప్తునకు చెన్నయ్ లోని కాంపిటేటివ్ అథారిటీ కోర్టు ఫ్రీజింగ్ ఆర్డర్ ను జారీ చేసింది. ఈమేరకు కేసులోని నిందితుల, వారి బంధుగణం పేరు మీద ఉన్న ఒక్కోటి చొప్పున ట్రాక్టర్, కారు, ఆటో, నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు ఇండ్లు సహా మొత్తం రూ. 23,52,116 విలువైన ఆస్తులను ఏడూళ్ల బయ్యారం పోలీసులు జప్తు చేశారు.

ఆస్తులు జప్తు చేసిన నిందితుల వివరాలు:
1. జాటోత్ విజయ్ S/o.దర్యాప్ సింగ్(లేట్ ), వయసు 28 సంవత్సరాలు, వృత్తి: కారు డ్రైవర్, R/o అమర్ సింగ్ తండా, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా.

2. జాటోత్ భాస్కర్ S/o బాలు, వయసు 28 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, R/o అమర్ సింగ్ తండా, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా.

3. జాటోత్ సురేష్ @ కన్నా ,S/o. వీరయ్య ,అమర్ సింగ్ తండా, తొర్రూర్ మండల్, మహబూబాబాద్ జిల్లా.

4. నూనావత్ గణేష్, S/o. శీను, దుబ్బ తండా , తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా.

    కాగా గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులను జైలుకు పంపించడమే కాక వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా కృషి చేసిన ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్రావును, సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

    Popular Articles