Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఖదీర్ అరెస్ట్

భద్రాచలం: భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ షేక్ ఖదీర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ హోదాలో గల ఖదీర్ భద్రాచలం ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

ఖదీర్ గతంలో బూర్గంపాడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసినపుడు అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడు. వివిధ రిజిస్ట్రేషన్ పనులకోసం ఆఫీసుకు వచ్చే క్లయింట్ల నుంచి నేరుగా డబ్బును ఫోన్ పే ద్వారా బదిలీ చేయించుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డాడు. ఏసీబీ అధికారులు నిరుడు జూన్ లో బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంలో ఖదీర్ వసూళ్ల అవినీతి కార్యకలాపాలను గుర్తించారు.

అనంతర దర్యాప్తులో ఖదీర్ బ్యాంకు ఖాతాలను, స్టేట్మెంట్లను, లావాదేవీలను పరిశీలించి అతని అవినీతి కార్యకలాపాలను ధ్రువీకరించుకున్నారు. ఖదీర్ స్వయంగానేగాక, తన కింద పనిచేసే సిబ్బంది ద్వారా కూడా పనుల కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చే ప్రజల నుంచి ఫోన్ పే ద్వారా వసూళ్లు చేసి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ పరిశీలనలో తేలింది. ఈ పరిణామాల్లో ఖదీర్ ను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వెల్లడించారు.

Popular Articles