గణపయ్యకు అందరూ లడ్డూ సమర్పిస్తారు. ఎవరి శక్తి కొద్దీ వారు విఘ్నేశ్వరునికి వివిధ రకాల లడ్డూలను సమర్పిస్తారు. ఈ లడ్డూలను వేలంలో భక్తులు రూ. లక్షలు చెల్లించుకుని దక్కించుకుంటుంటారు. కానీ భద్రాచలంలోని గణపయ్యకు సమర్పించిన లడ్డూ ప్రత్యేకతే వేరు. ఏమీటా ప్రత్యేకత అనుుంటున్నారా?

ఇప్పపువ్వు తెలుసు కదా? గిరిజన గూడేల్లోని ఇప్ప చెట్లకు ఈ పువ్వు పూస్తుంది. ఇటువంటి ఇప్పపూలతో తయారు చేసిన లడ్డూను బోర పెద్దిరెడ్డి అనే భక్తుడు భద్రాచలంలోని విఘ్నేశ్వరస్వామికి సమర్పించడం విశేషం. గిరిజనులు సేకరించిన ఇప్పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే గాక అనేక అనారోగ్య సమస్యలను రూపుమాపే దివ్య ఔషధ గుణాలు గల 10 కేజీల ఇప్ప పువ్వు డ్రైఫ్రూట్స్ లడ్డూను తయారు చేసి గణపతి మండపంలో సమర్పించి భక్తిని చాటుకున్నారు బోర పెద్దిరెడ్డి.

భద్రాద్రి రామయ్య వనవాసం చేసిన ఈ ప్రాంతంలో వైకుంఠ రాముడికి అత్యంత ప్రీతిపాత్రనైనది కూడా ఇప్ప పూల ప్రసాదమేనని భక్తగణం చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ అయోధ్యగా ప్రాచుర్యం పొందిన భద్రాద్రిలోని పర్యావరణ రహిత విగ్రహంగా పేరొందిన 18 అడుగుల మట్టి గణపతి వాటర్ కలర్స్ తో సుందరంగా కొలువై పూజలందుకుంటున్నారు. ఇప్ప పూల లడ్డూను ఆరగించిన గణపయ్యకు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పి. శ్రీకాంత్ రెడ్డి, మల్లెల లోకేష్ కుమార్, సీరపు సాయి సంపత్ రెడ్డి, ఆకుల వెంకట్, బెల్లంకొండ పుష్పగిరి తదితరులు పాల్గొన్నారు.