The “Cry for Help” Unheard
ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు హాస్టల్ లో ఉండలేనన్నాడు. ఏడ్చాడు. మొరపెట్టుకున్నాడు. తల్లిదండ్రులకేమో ఇంటి దగ్గర సరిగా శ్రద్ధ పెట్టక మిగతా పిల్లల కంటే వెనకబడతాడని సందేహం. మంచి మార్కులు రాకపోతే ఎలా బతుకుతాడనే చింత. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. చదువు ముఖ్యమా? పిల్లవాడు ఎలాగోలా బతికి ఉండటం ముఖ్యమా? తల్లిదండ్రులు ఎప్పటికీ అర్థం చేసుకోలేని చిక్కుప్రశ్న.
ప్రతి ఆత్మహత్య తమ ఆవేదన వినమని, అర్థం చేసుకోమని బాధితులు చేసే (cry for help) ఆక్రందనే.
తొంబై శాతం తల్లిదండ్రులు దానిని గ్రహించలేరు. పిల్లల వైపు నుంచి (empathy) ఆలోచించే ప్రయత్నం చేయరు. చదువుకోవడం, హాస్టల్లో ఉండటం అత్యంత సహజమని భావిస్తారు. వీడొక్కడే కాదు కదా? ఎంతో మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటుంటే ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని విసుక్కుంటారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… అందరి మానసిక స్థితి ఒకలా ఉండదు. సగం మంది పిల్లలు హాస్టల్ ఒక జైలులా ఉందని అనుకుంటారు. మరి కొందరు తోటి పిల్లల చేతిలో వేధింపులకు గురవుతుంటారు. ఇంకొంత మంది అక్కడుంటే వార్డెన్ తీరు నచ్చక బాధ పడుతుంటారు. చదువులో ఏవరేజిగా ఉన్నవారు లెక్చరర్లు చేసే అవమానాలతో తల్లడిల్లుతుంటారు.
ఇవన్నీ కాక… కౌమార దశలో ఉన్న పిల్లలది స్వతంత్ర వ్యక్తిత్వం సంతరించుకునే వయసు. మెదడులోని Prefrontal cortex (నుదరు వెనక ఉండే మెదడు ముందు పొర) ఎదిగేది ఈ వయసులోనే.
ప్రీఫంటల్ కార్టెక్స్…ప్రణాళికలు వేయడం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్ర ఆలోచనలు, ప్రవర్తనను నియంత్రించడం చేస్తుంది. ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సానుభూతి (empathy) చూపడం, భావోద్వేగాలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వ్యక్తిత్వ వికాసానికి, సంక్లిష్టమైన పనులను నిర్వహించడానికి సందేశాలు ఈ భాగం నుంచే వస్తుంటాయి.

తల్లిదండ్రులు తనను హాస్టల్ లో ఉండాలని ఎంతగా కోరుకుంటున్నారో… ఉండటం ఇష్టం లేదని తనూ అంతే అనుకుంటున్నానని భావిస్తాడు. తనకు అమ్మా, నాన్నల వద్ద ఏమాత్రం ప్రాధాన్యత లేదని, వారు ప్రేమ చూపడం కంటే తమ ఆదేశాలు పాటించాలనే పట్టుదల కనబర్చడమే ముఖ్యమని అనుకుంటున్నట్టు ఊహించుకుంటారు.
తట్టుకోలేని ఈ సంఘర్షణకు పరిష్కారం తన చావువల్లనే లభిస్తుందనే బలహీనతలోకి వెళ్లిపోతాడు.
combination of the stressful environment, the loss of autonomy, and the intense psychological pain of feeling unsupported by parents.
చివరకు తను ప్రాణం తీసుకుంటే తప్ప అర్థం చేసుకోలేరనే నిస్సహాయత ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది.
ఎలా గుర్తించాలి?:
హాస్టల్ వదిలి వెళ్లేటప్పుడు పేరెంట్స్ దూరమవుతున్నారనే భావోద్వేగానికి గురవడం సహజం. కంట నీరు పెడతారు. మళ్లీ వచ్చి కనిపించమని అడగడం కామన్.
కాని మొండి కేయడం, కిందపడి శోకించడం, పారిపోతానని చెప్పడం లేదా నిజంగానే తప్పించుకోవడం చేస్తే తప్పక వారి మాట వినాలి. ఇంటర్ చదివే పిల్లలంతా హాస్టళ్లలో ఉండి చదువుకోవడం లేదనే, పిల్లవాడి కోణం నుంచి ఆలోచించాలి. తన బాధ తీవ్రతను అర్థం చేసుకోవాలి. అభిప్రాయాన్ని గౌరవించాలి.
(అందరు పిల్లలు సూయిసైడ్ వరకు వెళ్తారని కాదు. అవగాహన కోసం చేస్తున్న వివరణ ఇది.

✍️ బి.టి. గోవిందరెడ్డి

