హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ గదిలో బ్యూటీషియన్ ఒకరి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బ్యూటీషియన్ అనూష (26) భర్తతో ఏర్పడిన మనస్పర్థల వల్ల బీహెచ్ఈఎల్ సమీపంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోందని, స్నేహితుల వద్దకు వెడుతున్నట్లు చెప్పిన అనూష ఆదివారం వెళ్లి తిరిగి రాలేదని రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె స్నేహితుడు ఒకరు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. ఓ హోటల్ గదిలో శవంగా లభ్యమైన అనూష మృతిపై అనుమానాలున్నట్లు ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


