Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘భూ భారతి’ చట్టంపై అవగాహన షెడ్యూల్

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం భూ భారతిపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రాల్లో భూ భారతి చట్టంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమాల నిర్వహణ, షెడ్యూల్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ఇందులో భాగంగా మండల కేంద్రాల్లోని ముఖ్యమైన ప్రదేశాలు, గ్రామ పంచాయతీ ఆఫీసులు, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద పోస్టర్స్ ప్రదర్శించాలని, కరపత్రాలను తయారుచేసి గ్రామాలలో పంచాలని సంబంధిత శాఖల సిబ్బందిని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుండి మ. 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నియోజకవర్గాల వారీగా మండల కేంద్రాల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల వివరాలు వెల్లడించారు.

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో..
ఏప్రిల్ 17 న ఉదయం 9.00 గంటలకు నేలకొండపల్లి మండలంలో, ఏప్రిల్ 19న ఉదయం 9.00 గంటలకు తిరుమలాయపాలెం మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు కూసుమంచి మండలంలో, ఏప్రిల్ 21 న ఉదయం 9.00 గంటలకు ఖమ్మం రూరల్ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో..
ఏప్రిల్ 21 న మధ్యాహ్నం 2.00 గంటలకు ఖమ్మం అర్బన్ మండలంలో, ఏప్రిల్ 22న ఉదయం 9.00 గంటలకు రఘునాథపాలెం మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..
ఏప్రిల్ 22 న మధ్యాహ్నం 2.00 గంటలకు ముదిగొండ మండలంలో, ఏప్రిల్ 23 న ఉదయం 9.00 గంటలకు మధిర మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు ఎర్రుపాలెం మండలంలో, ఏప్రిల్ 24న ఉదయం 9.00 గంటలకు చింతకాని మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు బోనకల్ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వైరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..
ఏప్రిల్ 25 న ఉదయం 9.00 గంటలకు వైరా మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు ఏన్కూరు మండలంలో, ఏప్రిల్ 26 న ఉదయం 9.00 గంటలకు కొణిజర్ల మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు సింగరేణి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..
ఏప్రిల్ 28 న ఉదయం 9.00 గంటలకు సత్తుపల్లి మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు వేంసూర్ మండలంలో, ఏప్రిల్ 29 న ఉదయం 9.00 గంటలకు కల్లూరు మండలంలో, మధ్యాహ్నం 2.00 గంటలకు పెనుబల్లి మండలంలో, ఏప్రిల్ 30న ఉదయం 9.00 గంటలకు తల్లాడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..
ఏప్రిల్ 30 న మధ్యాహ్నం 2.00 గంటలకు కామేపల్లి మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని, జిల్లాలోని రైతులు, భూ యజమానులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు తమ మండలాల పరిధిలో జరిగే అవగాహన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్రీజ తన ప్రకటనలో కోరారు.

Popular Articles