Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ప్రగతి భవన్ వద్ద ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

తెలంగాణా సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలానికి దారి తీసింది. ప్రత్యేక తెలంగాణా వచ్చినా ఉద్యోగాలు లేవని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని చందర్ అనే ఆటో డ్రైవర్ ఈ ఘటనకు పాల్పడ్డాడు.

ఒంటిపై కిరోసిన్ పోసుకుని చందర్ నిప్పంటించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై నిలువరించారు. చందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తాను 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కూడా చందర్ చెప్పడం గమనార్హం. రవీంద్రభారతి వద్ద నాలుగు అనే వ్యక్తి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Popular Articles