Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ts29 ఎఫెక్ట్: రంగంలోకి పోలీసులు, నిందితునికై వేట

మైనర్ బాలికపై అత్యాచాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించిన బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుని కోసం ఖమ్మం పోలీసులు రంగంలోకి దిగారు. వారం, పది రోజుల క్రితం జరిగిన ఈ ఘోర ఘటనను కొద్ది సేపటి క్రితమే ts29 వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆయా వార్తా కథనాన్ని చదివిన ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెంటనే స్పందించి, తదుపరి చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక

పల్లెగూడెం గ్రామానికి చెందిన ఈ బాలికపై ముస్తఫానగర్ లోని పార్శీబంధానికి చెందిన ఓ సంపన్న కుటుంబ యజమాని కుమారుడు దురాగతానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఈ ఘటనపై చలించి, తీవ్ర స్థాయిలో స్పందించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవలసందిగా పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

Popular Articles