Top 5 This Week

Related Posts

ఢిల్లీ కొత్త సీఎం ఎన్నిక

ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆప్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా మంత్రి అతిశీని ఎన్నుకుంటున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఈమేరకు ఆప్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి గత శుక్రవారం తీహాడ్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలైన సంగతి తెలిసిందే. సీఎం పదవికి తాను రాజీనామ చేస్తానని, కొత్త సీఎం ఎంపిక జరుగుతుందని ఆయన ప్రకటించారు. ఈమేరకు ఆప్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో మంత్రి నితిశీని ఢిల్లీ తదుపరి సీఎంగా ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

Popular Articles