Top 5 This Week

Related Posts

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

  • అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
  • తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.
  • పశ్చిమ బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి.
  • అన్ని రాష్ట్రాల్లో మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించున్నారు.

Popular Articles