Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పార్లమెంట్ నియోజకవర్గాలకు పీసీసీ ఇంఛార్జిల నియామకం

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జి వైస్ ప్రెసిడెంట్లను, జనరల్ సెక్రెటరీలను నియమిస్తూ తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు నియామకపు ఆదేశ పత్రాన్ని విడుదల చేశారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వైస్ ప్రెసిడెట్ గా ఆదిలాబాద్ కు ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, కరీంనగర్ కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జహీరాబాద్ కు బండి రమేష్, మెదక్ కు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్, మల్కాజిగిరికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సికింద్రాబాద్ కు హన్మాండ్ల ఝాన్సీరెడ్డి, హైదరాబాద్ కు చిన్నపాటల సంగమేశ్వర్, చేవెళ్లకు బానోత్ రామ్మోహన్, మహబూబ్ నగర్ కు ఎం. వేణుగౌడ్, నాగర్ కర్నూల్ కు కొండేటి మల్లయ్య, నల్లగొండకు నమిండ్ల శ్రీనివాస్, భువనగిరికి కోటింరెడ్డి వినయ్ రెడ్డి, వరంగల్ కు చిట్ల సత్యనారాయణ, మహూబూబాబాద్ కు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్ రావు, ఖమ్మానికి డాక్టర్ పి. శ్రావణ్ కుమార్ రెడ్డిలను నియమించారు.

అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఇంచార్జి ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఆర్గనైజైషన్ ఇంచార్జిలుగా మరికొందరిని నియమించారు. వారి వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

Popular Articles