Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

టీపీసీసీ అధ్యక్షుడు ఇతనే..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు కొత్త పీసీసీ అధ్యక్షున్ని ప్రకటించింది. ప్రస్తుత టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రకటన జారీ చేసింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మహేష్ కుమార్ గౌడ్ నియామకానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం గత జూలై 7వ తేదీన ముగిసింది. అప్పటి నుంచి కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకానికి కసరత్తు జరుగుతోంది. పీసీసీ పదవి రేసులో అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ, బీసీలకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది.

Popular Articles