Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఆర్టీసీ బస్సెక్కిన వైఎస్ షర్మిల!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి తెనాలి వరకు టికెట్ తీసుకుని ఆమె బస్సులో ప్రయాణించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎన్నికల హామీని సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలన్నారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు? అంటూ కూటమి సర్కార్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని సీఎం చంద్రబాబకు ఆమె పోస్ట్ కార్డు రాశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్:

  • చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది.
  • అయినా ఉచిత బస్సు ప్రయాణం పై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు.
  • రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు? అని అడుగుతున్నారు.
  • తెలంగాణలో వారంలో అమలు చేశారు.
  • పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి ?
  • ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనా ?
  • రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు.
  • రోజు మహిళల ద్వారా రూ. 7.00 కోట్ల ఆదాయం.
  • నెలకు రూ. 300 కోట్లు ఆదాయం.
  • ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా ?
  • మహిళల ఓట్లు తీసుకున్నారు.
  • హామీ ఇచ్చారు.
  • ఇప్పుడు మహిళల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేయలేరా?
  • మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే.
  • ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు
  • ఇలాంటి తక్కువ ఖర్చు పథకం మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదు
  • మీకు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేస్తారా ?
  • ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి?
  • ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తారా ?
  • ఎప్పుడు అమలు చేస్తారు? అని ప్రజలు అడుగుతున్నారు.
  • ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది.
  • ఎంతో మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తారు.
  • ఇది చాలా మంచి పథకం.
  • చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం.
  • వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయండి.
  • అదే విధంగా మహిళల కోసం పెట్టిన పథకాలు వెంటనే అమలు చేయండి.
  • ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి.
  • ఇప్పటికే మార్కెట్ లో అన్ని ధరలు పెరిగాయి
  • మహిళల మీద భారం పడుతుంది.
  • మహిళలకు భరోసా కావాలి.
  • మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి.
  • రాష్ట్రంలో నెల రోజుల్లో జరిగిన అత్యాచారాల మీద రిపోర్ట్ తీశాం.
  • అన్ని పేపర్ల నుంచి ఆర్టికల్స్ సేకరించాం.
  • బాటా చెప్పుల తరహాలో మద్యం ధరలు తగ్గించారు.
  • రూ. 99 కే మద్యం ఇస్తే…. మహిళల మీద అత్యాచారాలు పెరుగుతాయి.
  • ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపిస్తున్నాం.
  • రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులు పంపిస్తాం.
  • ఇది చూసైనా వెంటనే చంద్రబాబు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి.

ఈ సందర్భంగా బస్సులోని మహిళలతో షర్మిల ముచ్చటించిన వీడియోను దిగువన చూడవచ్చు..

Popular Articles