Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

తుపాకీ ‘డంపులు’ స్వాధీనం

మావోయిస్టు పార్టీకి చెందిన భారీ ఆయుధ సంపత్తిని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మూడు డంపులను కనిపెట్టి నక్సల్స్ కు చెందిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం మీడియాకు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మాడుగుకొండ, తంగేడుకోట, మంప అడవుల్లో కనుగొన్న ఈ డంపుల్లో భారీ ఎత్తున తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

ఒక ఏకే-47, ఐదు ఎస్ఎల్ ఆర్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, అయిదూ .303, రెండు బీజీఎల్, ఒక పిస్టల్, రెండు తపంచాలు, బీజీఎల్ షెల్స్ 16, బీజీఎల్ కాట్రిడ్జులు20, డిటొనేటర్లు 15 చొప్పున డంపుల్లో లభ్యమైనట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా ఎనిమిది వాకీ టాకీలు, 26 ఖాళీ తుపాకీ మ్యాగ్జిన్లు, 7.62ఎంఎం తూటాలు 270, 5.56 ఎంఎం తూటాలు 65, .303 తూటాలు 254, 9ఎంఎం తూటాలు 17, ఒక టెలీస్కోప్, 37 కిలోల కార్డెక్స్ వైరును కూడా స్వాధీనం చేసుకున్నారు.

డంపుల్లో లభ్యమైన మావోయిస్టుల ఆయుధ సంపత్తిలోని తుపాకీ తూటాలు, బీజీఎల్ షెల్స్ వగైరా..

Popular Articles