విజయవాడ: అటవీ భూముల దురాక్రమణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం సంచలన వీడియో విడుదల చేశారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో చేసినట్లు పేర్కొంటున్న అటవీ భూముల ఆక్రమణలపై ఈ వీడియోను పవన్ విడుదల చేయడం గమనార్హం. ఇటీవల చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఏరియల్ సర్వే సందర్భంగా తీసిన వీడియోను ఆయన విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా విడుదల చేసిన వీడియోలో పోస్ట్ చేశారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా అటవీ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన వీడియోను దిగువన చూడవచ్చు..

