మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలతో గురువారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మి నరసింహాచలం అలియాస్ గౌతమ్, అలియాస్ సుధాకర్ మృతి చెందినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సుధాకర్ మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. సుధాకర్ పై రూ. 40 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్ మృతుడు మరో అగ్రనేత బండి ప్రకాష్ అనే ప్రచారం కూడా జరుగుతుండడం గమనార్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


