Top 5 This Week

Related Posts

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

కరోనా మహమ్మారి మరో ఎమ్మెల్యేను బలి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సమరేష్ దాస్ గత నెల 18వ తేదీన కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. సుమారు నెల రోజులపాటు ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూనే డెబ్బయి నాలుగేళ్ల వయస్సు గల సమరేష్ దాస్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత జూన్ నెలలో బెంగాల్ అధికార పార్టీకి చెందిన తమొనోష్ ఘోష్ కరోనా సోకి మరణించిన సంగతి తెలిసందే. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కరోనా కబలించడంతో తృణమూల్ పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Popular Articles